హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్.. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడంలో భాగంగా మరోసారి తన ప్లాస్మాను దానం చేశారు. ఆ విషయాన్ని చెబుతూ, రెండు ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. 'ప్లాస్మాటిక్ 3! 1,2,3 ప్లాస్మాటిక్' అంటూ రాసుకొచ్చాడు.
కరోనా వ్యాక్సిన్ కోసం మళ్లీ ప్లాస్మా దానం
ప్రాణాంతక కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడంలో భాగంగా ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్, మళ్లీ తన ప్లాస్మాను దానం చేశారు.
హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్
టామ్, తన భార్య రీటా విల్సన్.. మార్చిలో ఆస్ట్రేలియాలో ఓ సినిమా షూటింగ్లో ఉండగా, కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కోలుకున్నారు. అనంతరం టామ్.. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ తయారీలో భాగంగా తన ప్లాస్మాను ఇచ్చారు. ఇప్పుడు మరోసారి దానం చేసి వార్తల్లో నిలిచాడు.
ఇది చదవండి:లాక్డౌన్ అనుభవంపై రష్మిక ఎమోషనల్ పోస్ట్