తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లాక్​డౌన్ వేళ పేద ప్రజలకు అండగా షారుక్ ఖాన్ - shah rukh khan pm narendra modi

బాలీవుడ్​ బాద్​షా షారుక్.. పీఎం కేర్స్​కు విరాళమందిస్తున్నట్లు చెప్పాడు. ముంబయి, దిల్లీ, కోల్​కతా నగరాల్లో తమ సంస్థల తరఫున పేద ప్రజలకు సాయం చేయనున్నట్లు స్పష్టం చేశాడు.

కరోనాపై కట్టడికి బాద్​షా షారుక్ సాయం
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్

By

Published : Apr 3, 2020, 10:10 AM IST

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌, కరోనాపై పోరాడుతున్న భారత ప్రభుత్వానికి తన వంతు సహకారాన్ని అందించనున్నట్లు ప్రకటించాడు. తన ఆధ్వర్యంలోని రెడ్‌చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మీర్‌ ఫౌండేషన్, రెడ్‌ చిల్లీస్‌ వీఎఫ్ఎక్స్‌ సంస్థలతో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజీ తరపున పలు దాతృత్వ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించాడు. విపత్కర పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా కరోనా మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగించాలని అన్నాడు. తన వంతు బాధ్యతగా తన టీమ్​తో కలిసి పలు సహాయ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పాడు. ఇందుకోసం ముందుగా ముంబయి, కోల్‌కతా, దిల్లీ నగరాలను ఎంచుకున్నట్లు వెల్లడించాడు. కరోనా కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రులు ఉద్ధవ్‌ ఠాక్రే, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్న కృషిని అభినందించాడు.

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌

కార్యక్రమాలిలా

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ తరపున పీఎం-కేర్స్‌ సహాయనిధికి విరాళం అందివ్వనున్నట్లు ప్రకటనలో తెలిపాడు షారుక్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రెడ్‌చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి నగదు విరాళం ప్రకటించాడు. అయితే ఎంత మొత్తం అందించేదీ తెలియజేయలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంఛైజీ, మీర్‌ ఫౌండేషన్ తరఫున పశ్చిమబంగా, మహారాష్ట్ర ప్రభుత్వాల వైద్యారోగ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కోసం 50వేల పర్సనల్ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లను ఇవ్వనున్నట్లు చెప్పాడు. ముంబయిలో 5,500 కుటుంబాలకు మీర్‌ ఫౌంఢేషన్‌, ఏక్‌ సాథ్‌ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి నెల రోజుల పాటు భోజనం అందజేయబోతున్నట్లు ప్రకటించాడు. ఆస్పత్రులు, ఇళ్ల వద్ద భోజన సదుపాయం లేని వారికి 2వేల మీల్స్ అందించేందుకు వంటగదిని ఏర్పాటుచేయనున్నట్లు స్పష్టం చేశాడు. ముంబయిలోని రోటీ ఫౌండేషన్‌తో కలిసి మీర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 లక్షల భోజన కిట్లను 10వేల మందికి నెల రోజులపాటు సరఫరా చేయనున్నారు. వీటితో పాటు మీర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల రోజులపాటు 2500 మంది రోజువారీ కూలీలకు నిత్యావసర సరకులు అందివ్వనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, బిహార్‌, పశ్చిమబంగా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోని 100 మంది యాసిడ్ బాధితులకు నెలవారీ ఖర్చులకు నగదును అందివ్వనున్నట్లు ప్రకటించాడు.

ABOUT THE AUTHOR

...view details