బాలీవుడ్ నటి, మోడల్ ఇషికా బోరా.. కరోనా సోకడం వల్ల జూన్ 24న అసోంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే అక్కడి పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని, సరైన సదుపాయలు అందట్లేదని చెప్పింది. తాను ఆత్మహత్య చేసుకుంటే ఎవరి బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. అందుకు సంబంధించి వరుసగా ట్వీట్స్ చేసింది. దీనితో పాటే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పుకొచ్చింది.
"ఈ ఆసుపత్రిలో నాకు సరైన సదుపాయాలు చేయట్లేదు. ఇక్కడి వాతావరణం చాలా ఘోరంగా ఉంది. సంప్రదాయ పద్ధతులతో కొవిడ్‌ను తగ్గించొచ్చు. కానీ ఇక్కడలా జరగడం లేదు. దీంతో నేను ఒత్తిడికి లోనవుతున్నాను. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? దీనితో పాటే డాక్టర్, నర్స్ కూడా నన్ను చూసేందుకు సరిగా రావడం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ ఉంచారు" -ఇషికా బోరా, నటి-మోడల్