తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది: శ్రద్ధ​

కరోనా ప్రభావంతో ఎంతోమందికి ఆకలి బాధలు తప్పడం లేదు. మరి మూగ జీవాల పరిస్థితి ఏంటి? వాటిని ఎవరు పట్టించుకుంటారు? అంటే వాటికి మేమున్నాం అంటూ ముందుకొస్తున్నారు కొందరు. ఆ జాబితాలో ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధాకపూర్‌ చేరింది.

Covid-19: On earth we are the only guest .. not the owners- Shraddha Kapoor
ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తోంది: శ్రద్ధాకపూర్​

By

Published : Apr 17, 2020, 10:51 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా ఆహారం దొరక్క అలమటిస్తున్న జంతువుల కోసం ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళం అందించింది బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్. "మీరు మూగ జీవాల కోసం గొప్ప సహాయం చేశారు" అంటూ ఆ సంస్థ ట్విట్టర్‌ ద్వారా శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపింది.

మిగిలిన ప్రాణులను బతకనివ్వండి

లాక్‌డౌన్‌ కారణంగా మీరు ఒంటరితనంతో అలసిపోయారు కదా! మనదే కాదు చాలా జంతువులదీ అదే పరిస్థితి అంటోంది శ్రద్ధ. "కొవిడ్‌-19 ప్రపంచాన్ని బలవంతంగా స్వీయ నిర్బంధంలోకి నెట్టేసింది. ఐసోలేషన్‌ కారణంగా మానసిక ఒత్తిడి, ఒంటరితనం, ఆందోళన.. లాంటి ఎన్నో ప్రభావాలకు గురవుతున్నారు మనుషులు. ఈ బాధలు జంతువులూ పడుతున్నాయి. ఇతరుల బాధ ఎలా ఉంటుందో మనం అనుభవిస్తే కానీ తెలియదు. మనతో పాటు ఈ భూమ్మీద జీవిస్తున్న ప్రాణుల పట్ల సానుభూతి చూపండి. వాటినీ జీవించనీయండి. భూమ్మీద చాలా జీవులు జీవితాంతం వరకూ ఒంటరిగానే బతుకుతున్నాయి. ఆ బాధతో స్వయంగా ప్రాణాలు తీసుకుంటున్నాయి. ఏ జీవి నిర్బంధంలో బతకకూడదు. మనం భూమ్మీదకు వచ్చిన అతిథులం మాత్రమే.. యజమానులం కాదు" అంది శ్రద్ధ. ఒంటరి జంతువుల ఫొటోలు పంచుకుంటూ 'ఎర్త్‌' వెబ్‌సైట్‌ ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌ను రీపోస్ట్‌ చేసిందీ హీరోయిన్.

ఒంటరి జంతువుల ఫొటోలను షేర్​ చేసిన శ్రద్ధాకపూర్​

ఇదీ చూడండి.. చియాన్​ విక్రమ్​.. విభిన్న పాత్రలకు కేరాఫ్​ అడ్రస్​

ABOUT THE AUTHOR

...view details