రెజ్లర్‌గా కెరీర్ ప్రారంభించిన స్టార్ హీరో అయిన హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ తన ఉదారతను చాటుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో 7 లక్షల వాటర్ బాటిళ్లను విరాళం ఇచ్చారు. కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్ కోసం తన సొంత సంస్థ 'వోస్' నుంచి ఈ పనికి శ్రీకారం చుట్టినట్లు ఆయన ఇన్‌స్టా వేదికగా స్పష్టం చేశారు.
7 లక్షల వాటర్ బాటిళ్లు విరాళమిచ్చిన డ్వేన్ జాన్సన్
కరోనా పోరాటంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా సేవలందిస్తున్నారు డాక్టర్లు, వైద్యసిబ్బంది, పోలీసులు. ఆ వారియర్స్ కోసం తాజాగా 7 లక్షల మంచి నీళ్ల బాటిళ్లను విరాళం ఇచ్చారు హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్.
7 లక్షల మంచినీళ్ల సీసాలు విరాళమిచ్చిన డ్వేన్ జాన్సన్
ఇన్‌స్టాలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న సెలబ్రిటీల్లో డ్వేన్ ఒకరు. సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ హోపర్ హెచ్‌క్యూ ప్రకారం.. 48 ఏళ్ల ఈ నటుడు ఒక్క యాడ్‌కు 10 లక్షల డాలర్లకు పైనే తీసుకుంటాడట. అత్యధిక పారితోషికం అందుకునే నటుడిగానూ గతేడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.