కరోనా వల్ల భారత్‌లో గత కొన్నిరోజుల నుంచి లాక్డౌన్ విధించారు. ఈ ప్రభావంతో రోజువారి కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు పలు రకాలుగా సాయం చేస్తున్నారు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మాత్రం వినూత్న ప్రయత్నం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఓ రెండు సేవాసంస్థలతో కలిసి విరాళాలు సేకరించనున్నాడు.
విరాళాల కోసం వర్చువల్ డేటింగ్‌కు సిద్ధమైన హీరో - కొవిడ్ 19 వార్తలు
కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రోజువారి కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యాడు హీరో అర్జున్ కపూర్. తన వంతు ప్రయత్నంలో భాగంగా, వారికి సాయం చేయనున్నట్లు చెప్పాడు.
![విరాళాల కోసం వర్చువల్ డేటింగ్‌కు సిద్ధమైన హీరో విరాళాల కోసం వర్చువల్ డేటింగ్‌కు సిద్ధమైన హీరో](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6697938-281-6697938-1586258811422.jpg)
హీరో అర్జున్ కపూర్
ఇందులో భాగంగా గివ్ ఇండియా అనే సంస్థ.. సుమారు 60 వేల మంది కార్మికులను గుర్తించింది. ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని, మనమందరం కలిసి ఆదుకుందామని కథానాయకుడు అర్జున్ అన్నాడు.
tofankind.orgవెబ్సైట్లోకి లాగిన్ అయి ఎవరైనా సరే తమకు తోచినంత విరాళం ఇవ్వొచ్చని చెప్పాడు అర్జున్. ఇలా ఇచ్చిన వారిలో ఓ ఐదుగురు లక్కీ విన్నర్స్‌ను ఎంపిక చేసి, ఈనెల 11న వారితో వర్చువల్ డేటింగ్‌కు వెళతానని అన్నాడు. ఆ సమయంలో వారు చెప్పినవి వింటూ, వారితో మాట్లాడుతూ, కలిసి భోజనం చేస్తానని పేర్కొన్నాడు.