ఓ మంచి ఆశయం కోసం భారత్లోని వివిధ భాషలకు చెందిన 100 మంది గాయనీగాయకులు ఒక్కటయ్యారు. వీరు ఓ పాటను రూపొందించి, కరోనా కట్టడి కోసం పోరాటం చేస్తున్న వారియర్స్(పోలీసులు, వైద్యులు తదితరులు)కు అంకితమివ్వనున్నారు. సింగర్స్లో ఆశా భోంస్లే, కుమార్ సను, సోనూ నిగమ్, హరిహరన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్ తదితరులు ఉన్నారు.
'వన్ నేషన్ వన్ వాయిస్' పేరుతో ఈ గీతాన్ని తెరకెక్కించారు. ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్(ఇస్రా) తరఫున లతా మంగేష్కర్.. మే 3న జాతికి అంకిమివ్వనున్నారు. 14 భాషల్లో రికార్డు చేసిన ఈ పాటను, 100 డిజిటల్ ఫాట్ఫామ్స్లో(టీవీ, రేడియో, సోషల్ మీడియా ఇతరత్రా వాటిలో) విడుదల చేయనున్నారు.