డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హాస్యనటి భారతీ సింగ్, ఆమె భర్తకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
డ్రగ్స్ కేసులో భారతీ సింగ్ దంపతులకు బెయిల్ - Bollywood Drugs Case
డ్రగ్స్ కేసులో జైలుకెళ్లిన నటి భారతీ సింగ్‌తో పాటు ఆమె భర్త హర్ష్‌కు బెయిల్ వచ్చింది. ఈ జంట గంజాయి సేవించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్సీబీ వీరిని అరెస్టు చేసింది.
డ్రగ్స్ కేసులో భారతీ సింగ్ దంపతులకు బెయిల్
నటి భారతీ సింగ్ ఇంట్లో శనివారం సోదాలు జరిపిన ఎన్సీబీ.. 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుంది. అలానే భారతీతో పాటు ఆమె భర్త హర్ష్.. గంజాయి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో పాటు చిన్న చిన్న నటీనటులను ఎన్సీబీ విచారించింది.