బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేయాలని ముంబయి కోర్టు పోలీసులను ఆదేశించింది. 'కశ్మీర్ కీ యోధ రాణి దిద్దా' రచయిత ఆమెపై కాపీరైట్ ఆరోపణలు చేయడమే ఇందుకు కారణం.
కాపీరైట్ ఉల్లంఘన.. కంగనా రనౌత్‌పై కేసు!
కంగనా రనౌత్, తన పుస్తకం విషయమై కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందని రచయిత ఆశిష్ కౌల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
కంగనా రనౌత్
గతేడాది 'పంగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కంగన.. ప్రస్తుతం జయలలిత బయోపిక్ 'తలైవి', 'ధాకడ్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇవీ చదవండి: