పరువు నష్టం కేసులో బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్‌కు అంధేరి మేజిస్ట్రేట్, బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ వేసిన కేసులో భాగంగా ఆమె కోర్టు ముందు హాజరు కాకపోవడమే ఇందుకు కారణం. ఇంతకముందు కూడా కంగనకు సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె న్యాయస్థానం ముందు హాజరు కాలేదు.
పరువు నష్టం కేసులో కంగనా రనౌత్‌కు వారెంట్
జావేద్ అక్తర్ చేసిన ఫిర్యాదులో భాగంగా కంగనకు ఇప్పటికే పలుమార్లు సమన్లు ఇచ్చిన న్యాయస్థానం.. ఇప్పుడు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సుశాంత్ ఆత్మహత్య విషయమై ఆమె చేసిన వ్యాఖ్యలే ఈ కేసుకు కారణం.
పరువు నష్టం కేసులో కంగనా రనౌత్‌కు వారెంట్
గతేడాది జులై 19న ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన.. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య చేసుకోవడానికి జావేద్ అక్తర్ కూడా ఓ కారణమని పరుష వ్యాఖ్యలు చేసింది. ఆ విషయమై నవంబరు 3న ఆమెపై పోలీసు కేసు పెట్టారు.