తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సినిమాలో ఓ సెట్ కోసం అంత డబ్బా..! - విజయ్ హీరో

ప్రస్తుతం తెరకెక్కుతున్న #తలపతి63లో ఫుట్​బాల్ కోచ్​గా కనిపించనున్నాడు హీరో విజయ్. సినిమాలో ఫుట్​బాల్ స్టేడియం సెట్​ను సూమారు రూ.6 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్నారు.

ఆ సినిమాలో ఓ సెట్ కోసం అంత డబ్బా..!

By

Published : Apr 10, 2019, 12:06 AM IST

తమిళనాట హీరో విజయ్​కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని సినిమా గురించి ఏ విషయం తెలిసినా అభిమానులు పండగ చేసుకుంటారు. ఇప్పుడు ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఇందులో ఓ స్టేడియం సెట్ కోసం సుమారు రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఫుట్​బాల్ కోచ్​గా కనిపించనున్నాడు.

అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరూ కలయికలో వచ్చిన తెరి, మెర్సల్ర చిత్రాలు తమిళనాడులో భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వస్తున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు.

దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్​గా నయనతార నటిస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details