చాలా దేశాల్లో తన ప్రభావం చూపిస్తున్న కరోనా.. భారత్‌ను కలవరపెడుతోంది. ప్రస్తుతం కేరళలో ఈ వైరస్ బాధితుల సంఖ్య 15కు చేరింది. ఈ నేపథ్యంలో అక్కడి థియేటర్లు.. నేటి నుంచి ఈ నెలాఖరు వరకు మూసివేయనున్నారు. వివిధ మలయాళ సినీ సంస్థల మధ్య కొచ్చిలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నేటి నుంచి థియేటర్లు బంద్.. కరోనానే కారణం - Theatres in Kerala
నేటి(బుధవారం) నుంచి ఈ నెలాఖరు వరకు, కేరళలోని సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. కొచ్చిలో మంగళవారం సినీ సంస్థల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
![నేటి నుంచి థియేటర్లు బంద్.. కరోనానే కారణం నేటి నుంచి థియేటర్లు బంద్.. కరోనానే కారణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6365221-762-6365221-1583896240199.jpg)
సినిమా థియేటర్
థియేటర్లతో పాటు విద్యా వ్యవస్థపైనా కరోనా ప్రభావం పడింది. కేరళలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల్లోని 1-7 తరగతులకు సెలవు ప్రకటించారు అధికారులు. అయితే 8,9,10 తరగతులతో పాటు మాధ్యమిక విద్యకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. కళాశాలలు మూతపడనున్నట్టు స్పష్టం చేశారు.
ఇది చదవండి:కరోనాతో అక్కడి థియేటర్లు, పాఠశాలలు బంద్