ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ దీపికా పదుకొణెను భయపెట్టింది. తను ఫ్రాన్స్‌లోని ఓ ఫ్యాషన్ షోకు వెళ్లాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా దీపిక తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంది. ప్రస్తుతం దీపిక తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి '83' చిత్రంలో కపిల్ దేవ్ భార్య రోమి భాటియాగా నటిస్తోంది. రణ్‌వీర్ కపిల్‌దేవ్ పాత్ర పోషిస్తున్నాడు.
దీపికకు కరోనా భయం పట్టుకుందట..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా(కోవిడ్-19) బీభత్సం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది. తాజాగా ఈ వైరస్‌కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె భయపడి తన ప్రయాణాన్ని రద్దు చేసుకుందట.
దీపికా పదుకొణెకు కరోనా భయం పట్టుకుందట!
నిజజీవితంలో దంపతులైన ఈ జంట తొలిసారిగా తెరపై భార్యాభర్తలుగా నటిస్తున్న చిత్రం ఇదే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 10, 2020న తెరపైకి రానుంది.
ఇదీ చూడండి : 'పడి పడి లేచే మనసు' కాంబో రిపీట్!