కరోనా ప్రభావం ప్రస్తుతం తీవ్రంగా ఉంది. పలు దేశాల్లో ఇప్పటికే మరణాలు సంభవిస్తున్నాయి. భారత్‌లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు జాగ్రత్తలు వహిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకనిర్మాతలు, నటులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. అవసరమైతే తమ కార్యకలాపాలను వాయిదా వేసుకుంటున్నారు.
ప్రజలకు సూచనలు
పలువురు బాలీవుడ్ నటులు తమ అభిమానులకు, ప్రజలకు కరోనాపై అవగాహన పెంచేందుకు నడుం బిగించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ తాము మాస్క్‌లు ధరించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ సూచనలు ఇస్తున్నారు. బాలీవుడ్ కథానాయికలు సన్నిలియోని, పరినితి చోప్రా, సోహా అలీ ఖాన్‌తో పాటు పలువురు ఈ జాబితాలో ఉన్నారు.
బాలీవుడ్ కథానాయిక సన్నీలియోని తన భర్తతో కలిసి ఓ విమానాశ్రయంలో మాస్కులు ధరించి ఫోటో దిగింది. దానికి క్యాప్షన్ జోడించి ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది.
"కరోనా పట్ల జాగ్రత్త వహించండి. అస్సలు విస్మరించవద్దు. మీ చుట్టూ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి."
-సన్ని లియోని, కథానాయిక.