అన్‌లాక్-5 మార్గదర్శకాల్లో భాగంగా అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను ప్రారంభించడానికి కేంద్రం అనుమతించింది. ఈ నేపథ్యంలో థియేటర్లు ప్రారంభం కాగానే మొదటి చిత్రంగా తాను నిర్మించిన 'కరోనా వైరస్' విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెలిపాడు.
"ఎట్టకేలకు అక్టోబర్ 15వ తేదీ నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. సంతోషంగా ఉంది. లాక్‌డౌన్ తర్వాత విడుదల చేయనున్న మొదటి చిత్రంగా 'కరోనా వైరస్' నిలుస్తుంది. లాక్‌డౌన్ సమయంలో ఒక కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందనేది చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. లాక్‌డౌన్‌లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాం."