బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్-హీరోయిన్ సారా అలీఖాన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'కూలీ.నెం1'. ఈ చిత్రం అమెజాన్ప్రైమ్లో అత్యంత ఎక్కువ మంది వీక్షించిన సినిమాగా ఇటీవల రికార్డుకెక్కింది. అయితే తాజాగా రేటింగ్ ప్రకారం అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐఎమ్‌డీబీ చరిత్రలో అత్యంత తక్కువ రేటింగ్ 1.4/10 అందుకున్న రెండో సినిమాగా నిలిచింది. అంతకుముందు సఢక్ (1.1/10), హిమ్మత్వాలా(1.7/10) చిత్రాలు అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాయి.
రేటింగ్స్‌లో వరుణ్ 'కూలీ నెం.1' చెత్త రికార్డు - వరుణ్ ధావన్
బాలీవుడ్ చిత్రం 'కూలీ నెం.1' ఐఎమ్‌డీబీ చరిత్రలో అత్యంత తక్కువ రేటింగ్ సంపాదించుకున్న రెండో సినిమాగా చెత్త రికార్డును నమోదు చేసింది. అంతకుముందు 'సఢక్', 'హిమ్మత్వాలా' చిత్రాలు ఈ స్థాయిలో రేటింగ్‌ను అందుకున్నాయి.
వరుణ్
1995లో వచ్చిన 'కూలీ నెం.1'కు రీమేక్‌గా తెరకెక్కిందీ సినిమా. అందులో గోవింద, కరిష్మా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటి చిత్రంలో వరుణ్-సారా జంటగా కనిపించారు. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. తండ్రి డైరెక్షన్లో వరుణ్ నటించడం ఇది రెండోసారి.
ఇదీ చూడండి : థియేటర్లపై ఆంక్షల్ని ఎత్తివేయండి: విజయ్
Last Updated : Dec 29, 2020, 9:00 AM IST