బాలీవుడ్లో మరో బ్లాక్‌బస్టర్ సినిమా రీమేక్‌కు రంగం సిద్ధమైంది. గోవిందా, కరిష్మా కపూర్ జంటగా నటించి హిట్ కొట్టిన చిత్రం 'కూలీ నెంబర్ 1'. ఇప్పుడీ సినిమాను వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కించనున్నారు. సారా అలీ ఖాన్ హీరోయిన్గా నటించనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు కథానాయకుడు. కూలీ బ్యాడ్జ్ ఫొటోను ట్వీట్ చేశాడు.
వెండితెరపై మరోసారి 'కూలీ నెంబర్ 1' - సారా అలీ ఖాన్
వరుణ్ ధావన్ కూలీగా కనిపించేందుకు సిద్ధమయ్యాడు. 'కూలీ నెంబర్ 1' రీమేక్‌లో నటిస్తున్నాడు. 2020 మే 1న విడుదల కానుందీ సినిమా.
వెండితెరపై మరోసారి 'కూలీ నెంబర్ 1'
మాతృకను తెరకెక్కించిన డేవిడ్ ధావన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది.
వరుణ్ ధావన్ చివరగా 'కళంక్'లో కనిపిస్తే, గతేడాది వచ్చిన 'సింబా'తో వెండితెరపై అరంగేట్రం చేసింది సారా.