తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెళ్లి దుస్తుల్లో వరుణ్-సారా.. విషయమేమిటంటే! - Coolie No 1 remake

బాలీవుడ్​ సినిమా 'కూలీ నం.1'కు సంబంధించిన మరో పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో వరుణ్-సారా పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్నారు.

పెళ్లి దుస్తుల్లో వరుణ్-సారా.. విషయమేమిటంటే!
వరుణ్​ ధావన్-సారా అలీ ఖాన్

By

Published : Jan 3, 2020, 5:10 AM IST

బాలీవుడ్ హీరో వరుణ్​ ధావన్-హీరోయిన్ సారా అలీ ఖాన్.. పెళ్లి దుస్తుల్లో సందడి చేస్తున్నారు. ఆమెను ఎత్తుకొని వరుణ్ నవ్వులు చిందిస్తున్నాడు. ఇందులో ధావన్ వైట్​ సూట్​లో ఉండగా, తెలుపు ఫ్రాక్​లో సారా మెరిసిపోతోంది. ఈ స్టిల్ 'కూలీ నం.1' సినిమాలోనిది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఫొటోను 'కూలీ నం.1 గ్లింప్స్' అంటూ ట్విట్టర్​లో పంచుకున్నారు.

1995లో వచ్చిన 'కూలీ నం.1'కు రీమేక్​గా తెరకెక్కుతోందీ సినిమా. అందులో గోవింద, కరిష్మా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటి చిత్రంలో వరుణ్-సారా జంటగా కనిపించనున్నారు. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తండ్రి డైరక్షన్​లో వరుణ్​ నటించడం ఇది రెండోసారి. మే 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

కూలీ నం.1 సినిమా ఫస్ట్​లుక్

ABOUT THE AUTHOR

...view details