గత కొన్ని నెలల నుంచి వార్తల్లో నిలుస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. 'మణికర్ణిక' సీక్వెల్లో నటించనున్నట్లు ఈమె ఇటీవల ప్రకటించింది. అయితే ఈ సినిమా కథ తన దగ్గరి నుంచి తస్కరించిందేనని రచయిత అశిష్ కౌల్ ఆరోపణలు చేశారు. ట్వీట్ కూడా చేశారు.
"నా కథను కంగన దొంగిలించింది. సమాజంలో నిజం కోసం పాటుపడే తాను.. ఇలా చేయడం ఆశ్చర్యంగా ఉంది. దీన్ని శ్రమ దోపిడీగా పరిగణిస్తాను. హక్కుల కోసం పోరాడే కంగన నాలాంటి రచయిత హక్కులను భంగపరచడం ఎంతవరకు సమంజసం. ఆమె ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు"