తెలంగాణ

telangana

సారా అలీఖాన్‌ కోసం అక్షయ్, ధనుష్‌..!

తన అందం, అభినయంతో అలరిస్తున్న బాలీవుడ్ నటి సారా అలీఖాన్​ ఇద్దరు ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వార్తను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.

By

Published : Jan 30, 2020, 3:21 PM IST

Published : Jan 30, 2020, 3:21 PM IST

Updated : Feb 28, 2020, 1:12 PM IST

Confirmed! Sara to feature with Akshay-Dhanush in Atrangi Re
ఓ భామ.. ఇద్దరు కథానాయకులు

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్, తమిళ నటుడు ధనుష్‌ హీరోలుగా ఓ క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ ఇద్దరి కథానాయకులతో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'అట్రాంగిరే'. సారా అలీఖాన్‌ కథానాయిక. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

ఓ భామ.. ఇద్దరు కథానాయకులు

హిమాన్షు శర్మ కథ అందిస్తుండగా, ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నాడు. భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1 నుంచి ప్రారంభమవుతుంది. 2021 ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి:'మ్యాట్రిక్స్​' నూతన సిరీస్​లో 'ప్రియాంకచోప్రా'..!

Last Updated : Feb 28, 2020, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details