అనుకున్నట్లే జరిగింది! నాని 25వ చిత్రం 'వి'.. త్వరలో ఓటీటీలో విడుదల కానుంది! ఓ విషయాన్ని రేపు(ఆగస్టు 20) అభిమానులతో పంచుకోనున్నామని ఈ కథానాయకుడు తెలిపాడు. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయితేనేం త్వరలో థియేటరే మీ ఇంటికి రాబోతుంది' అని అందులో చెప్పాడు. దీంతో అమెజాన్ ప్రైమ్‌లోనే 'వి' రానుందని అభిమానులు ఓ అంచనాకు వచ్చేశారు.
'వి' వచ్చేది ఓటీటీలోనే.. నాని వీడియో పోస్ట్ - nani v cinema
'వి' సినిమాకు సంబంధించిన ఓ విషయాన్ని రేపు వెల్లడించనున్నట్లు హీరో నాని ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇది ఓటీటీ విడుదల గురించేనని అభిమానులు భావిస్తున్నారు.
V to hit OTT soon
ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సిన 'వి'.. లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న కారణంగా థియేటర్లను ఇప్పట్లో తెరిచేలా కనిపించడం లేదు. అందుకే చిత్రబృందం ఓటీటీ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నాని ప్రతినాయకుడిగా కనిపించనుండగా, సుధీర్‌బాబు పోలీస్‌గా అలరించనున్నాడు. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత.