తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బ్లాక్​బస్టర్​ రీమేక్​లో హృతిక్-సైఫ్ - Vikram Vedha remake

స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్​ అలీఖాన్​ ప్రధాన పాత్రధారులుగా తమిళ సూపర్​హిట్​ చిత్రం 'విక్రమ్ వేదా' ఖరారైంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్​ పైకి వెళ్లనుంది.

Vikram Vedha
హృతిక్ రోషన్

By

Published : Jul 10, 2021, 1:58 PM IST

తమిళ బ్లాక్​బస్టర్​ 'విక్రమ్​ వేదా' హిందీ రీమేక్​కు ఎట్టకేలకు ప్రధాన పాత్రధారులు ఖరారయ్యారు. బాలీవుడ్​ స్టార్లు హృతిక్​ రోషన్, సైఫ్​ అలీఖాన్ కాంబినేషన్​లో ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా శనివారం వెల్లడించారు.

హృతిక్-సైఫ్ కాంబోలో సినిమా

తమిళంలో 'విక్రమ్​ వేదా'ను తెరకెక్కించిన దర్శక ద్వయం పుష్కర్​-గాయత్రిలే ఈ రీమేక్​నూ డైరెక్ట్​ చేయనున్నారు. సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబరు 30న రిలీజ్​ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఎట్టకేలకు..

'విక్రమ్ వేదా' హిందీ రీమేక్​ను తొలుత సైఫ్-ఆమిర్​లతో తెరకెక్కించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఆమిర్​ తప్పుకోగా, ఆయన స్థానంలో హృతిక్​ను వేదా పాత్ర పోషించేందుకు తీసుకునట్టు వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల హృతిక్ కూడా తప్పుకున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ ఎట్టకేలకు హృతిక్, సైఫ్ కాంబినేషన్​లోనే చిత్రం తెరకెక్కబోతుంది.

ఇదీ చూడండి:మహేష్‌కి విలన్​గా ప్రముఖ దర్శకుడు

ABOUT THE AUTHOR

...view details