తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్షయ్​​పై ఫిర్యాదు.. ఆ యాడ్​లో నటించినందుకు! - అక్షయ్​కుమార్​పై ఫిర్యాదు

అసభ్యకరమైన కంటెంట్​ ఉన్న ఓ ప్రకటనలో నటించారంటూ బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్(akshay kumar movies)పై ఫిర్యాదు చేశారు ఓ న్యాయవాది. తక్షణమే అక్షయ్​పై చర్యలు తీసుకుని.. ఆ యాడ్​ను నిలిపివేయాలని కోరారు.

akshay
అక్షయ్​

By

Published : Sep 24, 2021, 6:07 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​పై(akshay kumar movies) ఫిర్యాదు నమోదైంది. పంజాబ్​ అండ్​ హరియాణా హైకోర్టుకు చెందిన అరోరా అనే న్యాయవాది పంజాబ్​ స్టేట్​ కమిషన్​ ఫర్​ ఉమెన్​, అడ్వటైసింగ్​ స్టాండర్డ్స్​ ఆఫ్​ ఇండియాకు​ ఈ ఫిర్యాదు చేశారు. అక్షయ్​ నటించిన తండ్రి, కూతురుకు సంబంధించిన ఓ యాడ్​లో​ అసభ్యకరమైన కంటెంట్​ సహా అందులో డబుల్​ మీనింగ్​ డైలాగ్​లు ఉన్నాయని అడ్వకేట్​ పేర్కొన్నారు.

అక్షయ్​తో(akshay kumar new movie) పాటు అడ్వటైసింగ్ కంపెనీపై కూడా కంప్లెయింట్​ చేశారు. హీరోతో పాటు సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. తక్షణమే ఆ ప్రకటనను నిలిపివేయాలని కోరారు.

త్వరలోనే అక్షయ్(akshay kumar movies)​.. 'సూర్యవంశీ', 'పృథ్వీరాజ్'​, 'బచ్చన్​ పాండే' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటే 'అత్రాంగీ రే', 'రామ్​ సేతు', 'సిండ్రిల్లా', 'ఓ మై గాడ్​ 2', 'రక్షాబంధన్'​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రముఖ బాలీవుడ్ హీరో ఇంట విషాదం

ABOUT THE AUTHOR

...view details