పునర్నవి, ఉద్భవ్ రఘునందన్ జంటగా వస్తోన్న వెబ్ సిరీస్ 'కమిట్ మెంటల్'. విష్ణు, వెంకటేశ్, నమ్రత, టీఎన్ఆర్, సాయి శ్వేత తదితరులు కీలక పాత్రలు పోషించారు. పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
పునర్నవి 'కమిట్ మెంటల్' సంగతేంటి? - పునర్నవి కమిట్ మెంటల్ ట్రైలర్
పునర్నవి, ఉద్భవ్ రఘునందన్ జంటగా నటించిన వెబ్ సిరీస్ 'కమిట్ మెంటల్'. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. కామెడీ, సీరియస్ పండించే ఈ ట్రైలర్ అలరించేలా ఉంది.
అలరిస్తోన్న 'కమిట్ మెంటల్' ట్రైలర్
ట్రైలర్లో అను, ఫణి అనే ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగే కలహాలు, కోపాలు, అనురాగాలు చూపించి ఆకట్టుకుంటున్నారు. కామెడీ, సీరియస్ పండించే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. మరి వీళ్ల కథేంటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఓటీటీ వేదిక ఆహాలో నవంబరు 13న విడుదల కానుంది.
Last Updated : Nov 8, 2020, 11:58 AM IST