తమిళ ప్రముఖ హాస్యనటుడు తీపెట్టి గణేశన్.. సోమవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయాన్ని దర్శకుడు శీను రామస్వామి వెల్లడించారు. అనారోగ్య సమస్యలతో మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన గణేశన్.. ప్రాణాలు కోల్పోయారు.
ప్రముఖ హాస్యనటుడు గణేశన్ మృతి - మూవీ న్యూస్
తమిళంలో హాస్యనటుడిగా అలరించిన గణేశన్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ప్రముఖ హాస్యనటుడు గణేశన్ మృతి
2009లో తెలుగులో వచ్చిన 'రేణిగుంట'లో పాత్రకుగాను ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు. దీనితో పాటే పలు తమిళ డబ్బింగ్ సినిమాలతోనూ ఈయన మనకు సుపరచితమే.
ఇది చదవండి:ప్రముఖ రచయిత,దర్శకుడు సాగర్ కన్నుమూత