కోలీవుడ్‌లో హాస్యనటుడిగా మంచి గుర్తింపు పొందిన సతీశ్.. అగ్రకథానాయకులు విజయ్, శివ కార్తికేయన్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో శివ కార్తికేయన్‌కు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
'శివ కార్తికేయన్ భార్య నన్ను ఎగతాళి చేసింది' - సతీశ్, శివ కార్తికేయన్ న్యూస్
తమిళ అగ్రహీరో శివ కార్తికేయన్‌తో తనకున్న అనుబంధాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు హాస్యనటుడు సతీశ్. తామిద్దరం మంచి స్నేహితులమని వెల్లడించాడు.
దర్శకుడు అట్లీ రూపొందించిన 'ముగాపుతగం' లఘుచిత్రం షూటింగ్లో శివ కార్తికేయన్‌తో పరిచయం ఏర్పడినట్లు సతీశ్ తెలిపాడు. అప్పటివరకు ఒకరికొకరు తెలియకపోయినా.. మొదటి రోజు చిత్రీకరణలోనే మంచి స్నేహితులమయ్యామని వెల్లడించాడు. లవర్స్ లాగా గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవారని.. ఒకరోజు తాను కాల్ చేస్తుంటే 'నీ మొదటి భార్య కాల్ చేస్తుందంటూ' శివ భార్య ఆర్తీ ఎగతాళి చేసిందని చెప్పాడు.
శివ కార్తికేయన్ నటించిన 'మెరీనా', 'ఎతిర్ నీచల్', 'రెమో', 'వెలైక్కరన్' వంటి చిత్రాల్లో శివ కార్తికేయన్‌తో పాటు హస్యనటుడు సతీశ్ నటించాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'అణ్ణాత్త'లోనూ ఛాన్స్ కొట్టేశాడు సతీశ్.