సూపర్‌స్టార్ రజనీకాంత్- దర్శకుడు శివ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రాబోతోంది. ఇందులో హీరోయిన్గా మీనా నటించనుంది. గతంలో 'ముత్తు', 'వీర', 'రౌడీ జమిందార్' చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. #రజనీ168లో కీర్తి సురేశ్, ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్-మీనా జోడీ కుదిరింది! - తాజా సినిమా వార్తలు
సుపర్ స్టార్ రజనీకాంత్,యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. ఇందులో మీనా హీరోయిన్గా నటించనుంది. ఇందులో కీర్తి సురేశ్ కీలక పాత్రలో కనిపించనుంది.
రజనీకాంత్ జోడీగా మీనా..!
ప్రస్తుతం 'దర్బార్'లో నటిస్తున్నాడు రజనీకాంత్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ముంబయి మాఫియా నేపథ్య కథతో తెరకెక్కించారు. ఆదిత్య అరుణాచలం అనే పోలీసు అధికారిగా రజనీ కనిపించనున్నాడు. నయనతార హీరోయిన్. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు. లైకా మూవీ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.