Vicky Kaushal bike number: నకిలీ నెంబర్ ప్లేట్ కేస్‌లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌కు ఉపశమనం లభించింది. సినిమా షూటింగ్ కోసం వాడిన టూవీలర్ రిజిస్ట్రేషన్ నెంబర్ నకిలీది కాదని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు తేల్చారు. సినిమా నిర్మాణ సంస్థ చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టంచేశారు.
ఇదీ జరిగింది..
'లుకా చుప్పీ 2' షూటింగ్లో వాడిన బైక్ విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం 'లుకా చుప్పీ 2'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతోంది. షూటింగ్లో భాగంగా సారాను బైక్‌పై ఎక్కించుకుని ఇండోర్‌లో షికార్లు కొట్టారు విక్కీ. అందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్‌గా మారింది.
విక్కీ బైక్ రైడ్ వీడియో చూసిన ఇండోర్‌కు చెందిన జైసింగ్ యాదవ్ షాక్‌కు గురయ్యారు. 'MP-09 UL 4872' నంబర్ గల తన స్కూటీ నెెంబర్ విక్కీ బైక్‌కు ఉందని నిర్ధరించుకుని పోలీసులను సంప్రదించారు. తన నెంబర్ ప్లేట్‌తో నకిలీ నెంబర్‌ను ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
బోల్ట్ వల్లే అలా..
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. విక్కీ వాడిన బైక్ నెంబర్ 4872 కాదని, అది 1872 అని తేల్చారు. నెంబర్ ప్లేట్‌కు బిగించిన బోల్ట్ వల్లే ఒకటి.. నాలుగులా కనిపించిందని వివరించారు. దీంతో విక్కీకి క్లీన్చిట్ ఇచ్చారు.
ఇదీ చూడండి:నకిలీ నంబర్ ప్లేట్‌తో విక్కీ కౌశల్ బైక్ రైడ్- కేసు నమోదు!