సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు నాగశౌర్య. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఏఎన్నాఆర్ క్లాసికల్ చిత్రాల్లో ఒకటైన 'మూగ మనసులు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాన్సెప్ట్ కూడా పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు.