*మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi age).. 'క్లాప్' టీజర్‌ను(clap movie) విడుదల చేశారు. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా.. స్పోర్ట్స్ కథతో తెరకెక్కించారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన కథానాయకుడు.. కృత్రిమ కాలితో తన ఆశయాన్ని ఎల నెరవేర్చుకున్నాడు అనేదే ఈ చిత్ర స్టోరీ. ఆకాంక్ష సింగ్ హీరోయిన్. ఇళయరాజా(ilayaraja) సంగీతమందించారు. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
*తడమ్ తెలుగు రీమేక్ 'రెడ్'. హిందీలోనూ(thadam hindi remake) దీనిని రీమేక్ చేస్తున్నారు. ఆదిత్యరాయ్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా మృణాల ఠాకుర్ ఎంపికైంది. వర్ధన్ కేట్కర్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నారు.