'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు సినీ ప్రియుల మనసు దోచిన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నా.. ఆ తర్వాత అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత కొన్ని అనుకోని వివాదాల్లో చిక్కుకొని, సినీ కెరీర్‌కు దూరమైంది. గతేడాది ఈ అమ్మడు రోహిత్ మిట్టల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. గతేడాది డిసెంబరు 13న పుణెలో ఘనంగా ఒక్కటైన ఈ జంట.. మరో మూడు రోజుల్లో పెళ్లిరోజు జరుపుకోనుంది. ఏడాదైన పూర్తి కాకుండానే విడాకులు తీసుకోనుందుకు సిద్ధమైందీ జంట. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ శ్వేతాబసు తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
"రోహిత్, నేను ఇద్దరం ఓ నిర్ణయానికి వచ్చే మా వివాహ బంధానికి ఇక్కడితో ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాం. గత కొద్దినెలలుగా చర్చించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏడాది కాలంలో నాకెన్నో మధుర జ్ఞాపకాలను అందించిన రోహిత్‌కు ధన్యవాదాలు"