తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శ్రీలంకలో ఉగ్రదాడిని ఖండించిన సినీ తారలు

ఈస్టర్​ పర్వదినాన శ్రీలంక వరుస దాడులతో దద్దరిల్లిపోయింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పలువురు సినీ​ తారలు స్పందిస్తూ.. ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు.

By

Published : Apr 21, 2019, 6:26 PM IST

శ్రీలంకలో ఉగ్రదాడిని ఖండించిన సినీప్రముఖులు

శ్రీలంకలో వరుస బాంబు దాడులు జరిగాయి. అనేక మంది చనిపోయారు. ఈ ఘటనపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​, శేఖర్​ కపూర్​, వివేక్​ ఆనంద్​ ఓబెరాయ్​, ప్రకాశ్​రాజ్​ దాడిని తీవ్రంగా ఖండించారు.

' ఇది చాలా బాధాకరం. ఒక్కటి జరిగితే తట్టుకోవడం కష్టం అలాంటిది వరుస దాడులు జరగడాన్ని అసలు ఊహించలేకపోతున్నాం. ఇది ఆపాల్సిందే'
- జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​, బాలీవుడ్​ నటి

'పక్కా ప్రణాళికతో ఈస్టర్​ రోజున దాడి చేశారు. ఉగ్రవాదం ప్రపంచానికే పెద్ద శత్రువు. ఇది ఉన్నంతవరకు ఎవరూ భద్రంగా బతకలేరు'
- శేఖర్​ కపూర్​, దర్శకుడు

' ఇలాంటి పవిత్రదినాన ఇంత పెద్ద స్థాయిలో ఉగ్రదాడి గురించి విని షాకయ్యా'
-అర్జున్​ కపూర్​, నటుడు

'ఇది చాలా బాధాకరమైన రోజు. ప్రశాంతత కోసం చర్చికు వెళ్లిన వారిపై దాడి జరగడం నిజంగా భయానకం. ప్రపంచంలో ఏం జరుగుతోంది?'
- హూమా ఖురేషీ, నటుడు

' ఈ ఉగ్రదాడి నిజంగా సిగ్గు చేటు. చాలా మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అందరూ ప్రార్థించాలని కోరుతున్నా'
-మధుకర్​ బండార్కర్​, దర్శకుడు

'ప్రార్థనలో ఉన్న ప్రజలపై శ్రీలంకలో దాడి జరిగింది. ఇది అసహ్యమైన పని. ఉగ్రవాదులు​ చేసే పనుల వల్ల మానవత్వం మంటగలిసిపోతుంది. ఎవరైతే ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారో వారి పట్ల జాగ్రత్తగా ఉండండి.
- ప్రకాశ్​రాజ్​, నటుడు

నటీనటులు వివేక్​ ఆనంద్​ ఒబెరాయ్​, బొమన్​ ఇరానీ, సోహన్​ అలీఖాన్​, సిద్దార్థ్​ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details