తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్రైలర్​తో సునీల్​.. కియారా రెమ్యునరేషన్ తెలిస్తే..​​ - సినిమా అప్టేడ్స్​

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రామ్​చరణ్​, నాగార్జున, విశ్వక్​సేన్​, నితిన్, సునీల్​​ చిత్రాల వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం..

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Aug 8, 2021, 2:58 PM IST

నాగార్జున-కాజల్​ జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్​ హైదరాబాద్​లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్‌లో నాగార్జున ఫొటోను పోస్ట్ చేసింది చిత్ర బృందం. యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు.

శంకర్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్​గా నటించేందుకు కియారా అడ్వాణీ పారితోషికం భారీగానే తీసుకుంటుందని తెలిసింది. సాధారణంగా తాను తీసుకునే రూ.4 కోట్ల రెమ్యునరేషన్‌ కన్నా రూ.కోటి ఎక్కువగా డిమాండ్‌ చేసిందట. మొత్తంగా రూ.5 కోట్లు కోరగా.. రూ.నాలుగు కోట్ల యాభై లక్షలకు చిత్రబృందం ఒప్పించిందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో చెర్రీ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించనున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు.

కియారా అడ్వాణీ

విశ్వక్​సేన్​ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'పాగల్' టైటిల్​​ వీడియో సాంగ్ రిలీజ్​ అయింది.​ 'మాస్​ కా దాస్​' అంటూ సాగే ఈ గీతం​ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి కథానాయికలు.

నటుడు సునీల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కనబడుటలేదు'. ఆదివారం ఈ చిత్ర ట్రైలర్​ను విడుదలైంది. ఎం.బాలరాజు దర్శకుడు. ఎస్‌.ఎస్‌.ఫిల్మ్స్‌, శ్రీపాద క్రియేషన్స్‌, షేడ్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుక్రాంత్‌ వీరెల్ల, వైశాలిరాజ్‌, హిమజ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మర్డర్‌ మిస్టరీ కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్​ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'మాస్ట్రో' చిత్రం. ఇటీవల ఈ చిత్రంలోని వెన్నెల్లో ఆడపిల్ల పాట విడుదలైంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్​ స్టిల్స్​ను షేర్ చేసింది చిత్ర బృందం. నభా నటేష్‌ హీరోయిన్​గా నటిస్తుండగా.. తమన్నా కీలక పాత్ర పోషిస్తుంది.

ఇదీ చూడండి: fahadh faasil birthday: ఛీ కొట్టిన వాళ్లే శెభాష్ అనేలా!

ABOUT THE AUTHOR

...view details