తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్యామ్​ సింగ రాయ్' సెన్సార్ పూర్తి.. 'గాడ్సే' కొత్త అప్డేట్ - sri vishnu movie

Cinema Updates: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్', సత్యదేవ్ నటిస్తున్న 'గాడ్సే', శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న 'అర్జున ఫల్గుణ' చిత్రాల వివరాలు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్

By

Published : Dec 19, 2021, 2:05 PM IST

Cinema Updates: నేచురల్​ స్టార్​ నాని నటించిన 'శ్యామ్​ సింగరాయ్' సినిమా సెన్సార్ పనులు​ పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్​ను సంపాదించుకుంది. డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్యామ్ సింగ రాయ్

నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి నటించారు. మలయాళ నటి మడోన్నా సెబాస్టియన్​ ప్రధాన పోత్ర పోషించారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

Godse Motion Poster

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'గాడ్సే' చిత్రం మోషన్​ పోస్టర్​ విడుదలైంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సినిమా టీజర్​ను విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ సినిమాకు గోపీ గణేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.

గాడ్సే

Arjuna Phalguna Release Date

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం అర్జున ఫల్గుణ. తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమృత కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన వీడియోను యూట్యూబ్​లో పోస్ట్​ చేసింది చిత్రబృందం.

అర్జున ఫల్గుణ

Dulqur Salman New Movie Update

మలయాళ నటుడు దుల్కర్​ సల్మాన్​ కొత్త సినిమా అప్డేట్​ వచ్చేసింది. దుల్కర్​ 33వ సినిమా ఫస్ట్​ లుక్​ను డిసెంబర్ 21న 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. నటి కాజల్ అగర్వాల్, అదితీరావు హైదరీ దుల్కర్​ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది.

దుల్కర్ కొత్త సినిమా

ఇదీ చదవండి:

'రన్​వే 34' షూటింగ్ పూర్తి.. త్వరలో 'ధర్మస్థలి' విడుదల

బాలయ్యతో రవితేజ.. ఈసారి డబుల్ మాస్​ గ్యారెంటీ!

'పుష్ప' కలెక్షన్స్​ చూస్తే పూనకాలే.. రెండో రోజు ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details