మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'(Ghani Movie). ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా సునీల్ శెట్టి, ఉపేంద్ర(Upendra New Movie) కీలకపాత్రలు పోషిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పంచ్ పేరుతో బుధవారం ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. బాక్సింగ్ రింగ్‌లో ఉన్న వరుణ్ పంచ్ ఇవ్వడం.. తమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
వరుణ్ తేజ్ 'గని' ఫస్ట్ పంచ్.. 'క్లాప్' అప్డేట్ - వరుణ్ తేజ్ సినిమా
టాలీవుడ్ నుంచి కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఆది పినిశెట్టి నటించిన 'క్లాప్'(Clap Movie), మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రాల అప్డేట్లు ఇందులో ఉన్నాయి.
క్రీడా నేపథ్యంలో ఆది పినిశెట్టి హీరోగా 'క్లాప్'(Clap Movie) చిత్రం తెరకెక్కుతోంది. ప్రమాదంలో కాలు కోల్పోయిన కథానాయకుడు.. కృత్రిమ కాలితో తన ఆశయాన్ని ఎల నెరవేర్చుకున్నాడు? అనేదే ఈ చిత్ర కథ. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్. ఈ చిత్రానికి ఇళయరాజా(Ilayaraja Songs) సంగీతమందించారు. అక్టోబర్ 8న క్లాప్ తొలి పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటను ఇళయరాజానే పాడడం విశేషం.
ఇదీ చూడండి:F3 Movie Shooting: 'ఎఫ్-3' షూటింగ్లో బన్నీ సందడి