మిమ్మల్ని అలరించేందుకు కొత్త సినిమా కబుర్లు మీ ముందుకొచ్చాయి. ఇందులో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్(Karthik aryan), సూపర్ స్టార్ మహేశ్‌బాబు మేనల్లుడు(Maheshbabu nephew) అశోక్ గల్లా నటించిన కొత్త చిత్రాలు సహా మిగతా సినిమాల వివరాలు ఉన్నాయి.
కార్తిక్ కొత్త సినిమా
బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్(Karhtik Aryan) కొత్త సినిమా ప్రకటన వచ్చింది. నదియావాలా గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న 'సత్యనారాయన్ కి కథ' సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ప్రేమ కథతో తెరకెక్కబోయే ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించనున్నారు.
థియేటర్లోనే..
చిత్రమైన పాత్రలు, వింత కథ, కలర్‌ఫుల్ టోన్‌తో రానున్న సినిమా 'ది సూసైడ్ స్క్వాడ్'(The Suicide Squad). జేమ్స్ గన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లోనే విడుదల కానుందని స్పష్టం చేసింది నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్. ఇప్పుడు మరో కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో రిలీజ్ కానుందీ సినిమా.
మహేశ్ మేనల్లుడి సినిమా
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతోనే అశోక్ తెరంగేట్రం చేయనున్నాడు. బుధవారం ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. 'హీరో'గా టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది. జిబ్రాన్ స్వరాలు సమకూర్చనున్నాడు. పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మోషన్ పోస్టర్ అభిమానులను అలరించింది.
ఇదీ చూడండి: Kate sharma: కేట్ శర్మ.. సోయగాల ముద్దుగుమ్మ!