గురు పవన్ దర్శకత్వంలో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఇదే మా కథ'. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ 'యు' సర్టిఫికెట్ లభించినట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం.
'ఇదే మా కథ' సెన్సార్.. షూట్ కంప్లీట్ చేసిన సుమంత్ - శ్రీకాంత్ ఇదే మా కథ సినిమా
కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'ఇదే మా కథ', 'విజయ్ రాఘవన్', 'అనగనగా ఒక రౌడీ' చిత్ర విశేషాలు ఉన్నాయి.
'బిచ్చగాడు' ఫేం హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త చిత్రం 'విజయ్ రాఘవన్'. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 14న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తైనట్లు తెలిపింది చిత్రబృందం. ఈ సినిమాలో హీరోయిన్గా ఆత్మిక నటిస్తోంది.
మనుయజ్ఞ దర్శకత్వంలో అక్కినేని హీరో సుమంత్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'అనగనగా ఒక రౌడీ'. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లు ప్రకటించారు సుమంత్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.