తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కేజీఎఫ్ 2' టీజర్​ కౌంట్​డౌన్.. ట్రైలర్​తో 'త్రిభంగ' - రిచా చద్దా న్యూస్

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'కేజీఎఫ్ 2' టీజర్, 'సమ్మతమే' టైటిల్ పోస్టర్, 'మేడమ్ చీఫ్ మినిస్టర్' ఫస్ట్​లుక్, 'త్రిభంగ' ట్రైలర్​ ఉన్నాయి.

CINEMA UPDATES FROM KGF-2, TRIBHANGA, SAMMATHAME, MADAM CHIEF MINISTER
'కేజీఎఫ్-2' టీజర్​ కౌంట్​డౌన్.. ట్రైలర్​తో 'త్రిభంగ'

By

Published : Jan 4, 2021, 1:26 PM IST

* 'కేజీఎఫ్-2' నుంచి కొత్త అప్​డేట్ వచ్చింది. జనవరి 8న హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10:18 గంటలకు చిత్ర టీజర్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సీక్వెల్​లో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్​రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

కేజీఎఫ్-2 సినిమాలో యష్

* నెట్​ఫ్లిక్స్​ నిర్మించిన 'త్రిభంగ' ట్రైలర్​ విడుదలైంది. సామాజిక నేపథ్య కథాంశంతో దీనిని తెరకెక్కించారు. ఇందులో కాజోల్ ఒడిస్సీ నృత్యకారిణిగా కనిపించనుంది. మిథిలా పాల్కర్, తన్వీ అజ్మీ ఇతర పాత్రలు పోషించారు. రేణుక షాహానె దర్శకురాలు.

* యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గురించి వెల్లడించారు. 'సమ్మతమే' టైటిల్​ పోస్టర్​ను విడుదల చేశారు. చాందినీ చౌదరి హీరోయిన్​గా నటించనుంది. శేఖర్ చంద్ర సంగీతమందిస్తుండగా, గోపీనాథ్ రెడ్డి దర్శకుడు.

కిరణ్-చాందినీ చౌదరి నటిస్తున్న 'సమ్మతమే' సినిమా

* రిచా చద్దా నటించిన 'మేడమ్ చీఫ్ మినిస్టర్' సినిమా ఫస్ట్​లుక్ విడుదలైంది. రాజకీయ నేపథ్య కథతో దీనిని రూపొందించారు. సుబాష్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 22న థియేటర్లలో విడుదల కానుంది.

రిచా చద్దా మేడమ్ చీఫ్ మినిస్టర్ ఫస్ట్​లుక్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details