*ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్.. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించింది. 50 ఏళ్లు పూర్తయిన కొన్నేళ్లు అవుతున్న సందర్భంగా, అడుగు ముందుకేసి 'ఎస్పీ మ్యూజిక్' సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని గురువారం ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ బాధ్యతలను దగ్గుబాటి సురేశ్ బాబు, రానా చూసుకుంటున్నారు.
మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి సురేష్ ప్రొడక్షన్స్ *లింగుస్వామి(lingusamy) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ కథ ఫైనల్ నరేషన్ పూర్తయినట్లు రామ్ తెలిపారు. 'సూపర్ డుపర్ కిక్' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందబోతుందని టాక్.
*నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తున్న 'వరుడు కావలెను' సినిమా షూటింగ్ గురువారం తిరిగి ప్రారంభమైంది. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
*ఇటీవల 'కృష్ణ అండ్ హిజ్ లీలా'తో అలరించిన సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న కొత్త చిత్రం 'నరుడి బ్రతుకు నటన'. దీని షూటింగ్ కూడా తిరిగి మొదలైంది. నేహా శెట్టి కథానాయిక. బ్రహ్మాజి కీలక పాత్ర పోషిస్తున్నారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
*హాస్యనటులు అలీ, నరేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' ప్రమోషన్‌ను రెబల్‌స్టార్ ప్రభాస్‌తో ప్రారంభించనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ నేపథ్యంలోనే జూన్ 25న సాయంత్రం 5గంటలకు ఈ సినిమాలోని పాటను విడుదల చేయనున్నారు.
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
*'సూర్పనగై' చిత్రంలోని నటి రెజీనాకు సంబంధించిన కొత్త స్టిల్స్ విడుదల చేసింది చిత్రబృందం. ఇవి సినీప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తిక్‌రాజు దర్శకత్వం వహిస్తున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చూడండి: RRR: 'ఆర్ఆర్ఆర్' సెట్లో భీమ్,రామ్.. చెప్పిన తేదీకే రిలీజ్?