తెలంగాణలో సినిమా థియేటర్ల తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 శాతం సామర్థ్యంతో సినిమాను ప్రదర్శించాలని పేర్కొంది. హాల్ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. భౌతిక దూరం నిబంధనలు విధిగా పాటించాలని తెలిపింది. థియేటర్లో ఏసీ 24 నుంచి 30 డిగ్రీలు ఉండేలా చూడాలని ఆదేశించింది.
అంతకుముందు సోమవారం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇదే విషయాన్ని చెప్పాడు. థియేటర్ల తెరుచుకోవడంపై నిర్ణయాధికారం సినీ పరిశ్రమదేనని అన్నారు.