ఆగస్టు 13న జరిగిన నిహారిక నిశ్చితార్థ వేడుకలో బన్ని దంపతులు స్టైలిష్‌గా కనిపించారు. అందుకే అల్లు అర్జున్ 'స్టైలిష్‌స్టార్' అంటారేమో అనిపించుకున్నారు. షూటింగ్‌లకు తక్కువమంది స్టాఫ్ ఉండటం వల్ల తన బ్లౌజ్‌ను తానే కుట్టుకుంటున్నా అని చెబుతున్నారు యాంకర్ సుమ. నవ్వులు పూయిస్తున్న ఆ సరదా వీడియోను అభిమానులతో పంచుకున్నారు. చాలా రోజుల తర్వాత నటుడు విశ్వక్‌సేన్ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. గుంజన్ సక్సేనా జీవిత కథలో మెప్పించిన జాన్వీ సెట్‌లో నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
కెరీర్లో వెంకీ దూకుడు... స్టైల్లో బన్నీ చెడుగుడు - ఉపాసన కొణిదెల
లాక్డౌన్ తర్వాత కొంతమంది సినీప్రముఖులు చిత్రీకరణలో పాల్గొనగా.. మరికొంత మంది ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి సమయంలో కొంతమంది స్టార్లు వారి షూటింగ్ విషయాలతో పాటు కొన్ని పాతజ్ఞాపకాలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. వారు ఎవరో? ప్రస్తుతం ఏమి చేస్తున్నారో? తెలుసుకుందామా.
వెంకటేశ్ వయసు 34 ఏళ్లు.. అల్లుఅర్జున్ స్టైలిష్ లుక్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొబైల్ కీ టోన్‌తో జనగణమన ప్లే చేశారు హీరోయిన్ అదాశర్మ. వెంకటేశ్ కథానాయకుడిగా కెరీర్‌ను మొదలు పెట్టి 34ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రానా తన బాబాయ్ వెంకటేశ్, నాగచైతన్యలతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. వెంకటేశ్ ఇండస్ట్రీకి వచ్చి 34ఏళ్లు అయిన సందర్భంగా ఓ అభిమాని చేసిన వీడియో కూడా ఆకట్టుకుంటోంది. ఇలా తాజాగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అనేక విషయాలు పంచుకున్నారు. ఆ సంగుతులివీ..