తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అర్జున్​ సురవరం' సినిమాకు సీక్వెల్? - తెలుగు సినిమా వార్తలు

హీరో నిఖిల్ నటించిన 'అర్జున్​ సురవరం'.. ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా హైదరాబాద్​లో సక్సెస్​ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిఖిల్​ ఆసక్తికర విషయాలు చెప్పాడు.

cinema producers thinking about to do a sequel for arjun suravaram said hero nikhil
త్వరలో పట్టాలెక్కనున్న మరో అర్జున్​ సురవరం?

By

Published : Dec 1, 2019, 7:45 PM IST

యువహీరో నిఖిల్​ నటించిన చిత్రం 'అర్జున్​ సురవరం'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్​తో బాక్సాఫీస్​ వద్ద జోరు చూపిస్తోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లో సక్సెస్​ మీట్​ను నిర్వహించింది చిత్రబృందం. హీరో నిఖిల్​.. సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.

"దాదాపు ఏడాదిన్నర పాటు ఎదురైనా కష్టాలు, ఎదురుచూపులకు ఫలితం దక్కింది. సినిమా ఆలస్యంగా బయటకొచ్చినా అదిరిపోయే విజయాన్ని అందించింది. ఈ స్పందన చూసిన నిర్మాతలు.. సీక్వెల్​ తీయాలనే ఆలోచన చేస్తున్నారు" -నిఖిల్​, సినీ హీరో

ఈ కథానాయకుడి మాటలు వింటోంటే మరో 'అర్జున్‌ సురవరం' రావడం పక్కా అనే సంకేతాలు వస్తున్నాయి. ఇదెప్పుడు పట్టాలెక్కనుందో? ఎప్పటికి ప్రేక్షకుల ముందుకొస్తుందో?.. తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

ఇదీ చదవండి:యువ వైద్యురాలి ఆత్మ శాంతి కోసం గంగా హారతి

ABOUT THE AUTHOR

...view details