తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రివ్యూ 2019: అవకాశాలు అందుకుని.. ఆకట్టుకుని.. అలరించి - కథానాయకల విశేషాలు

ఆకాశంలో నక్షత్రాల లాంటిది సినీరంగంలో నటుల జీవితం.. అప్పుడే తళుక్కుమని అంతలోనే కనిపించకుండా పోతారు. అందుకే ఓ సారి స్టార్​ అనే ముద్ర వేసుకునేంత వరకు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కొన్నిసార్లు స్టార్​లైనా పప్పులో కాలేసి నేలరాలే అవకాశాలూ ఈ రంగంలో అధికమే. అలాంటి కొంతమంది హీరోయిన్లను ఓసారి చూద్దాం.

cinema main news
అవకాశాలు అందుకొని... ఆకట్టుకుని... అలరించి...

By

Published : Dec 28, 2019, 8:49 AM IST

Updated : Dec 28, 2019, 12:47 PM IST

ఓ వైపు స్టార్​ హీరోయిన్​లు... మరో వైపు ఆకట్టుకునే కొత్తతరం అందాలు... కొత్త నీరొచ్చి పాతనీటిలో కలిసినట్టు ఉంటుంది ఏటా సినీరంగంలో ఈ మేళవింపు... వీళ్లే కాదు... ఈ రెండు శ్రేణులతో సంబంధంలేని నాయికలు కొంతమంది ఉంటారు.

అవకాశాలు అందుకుని... ఆకట్టుకుని... అలరించి

అగ్ర హీరోలతోనూ జతకట్టగల సమర్థులు
యువ హీరోలకి తగ్గ భామలుగా కనిపిస్తూ... అవకాశం వచ్చినప్పుడు అగ్ర కథానాయకులతోనూ జత కట్టగల సమర్థులు వీరు... వీరంతా కొత్త ప్రయోగాలకూ సై అంటుంటారు. స్టార్​ హీరోలతో సమానంగా పరిహారం అందకున్నా ఆ స్థాయిలోనే గుర్తింపు సొంతం చేసుకుంటారు. అవకాశాలనూ అంతే జోరుగా సంపాదిస్తుంటారు. స్టార్‌ నాయిక అనిపించుకున్నాక... ఫలానా హీరోలతోనే చేయాలి.. ఫలానా దర్శకులే పిలవాలి అని కొన్ని లెక్కలేసుకుని ప్రయాణం చేయాల్సొస్తోంది. వీళ్లు మాత్రం అలాంటి లెక్కలతో పనే లేదన్నట్టుగా దూసుకెళ్తుంటారు. మంచి కథ అనిపిస్తే వెంటనే పచ్చజెండా ఊపేస్తూ కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంటారు. ఏటా మూడు నాలుగు సినిమాల్ని అలవోకగా చేసేయగలరు. ఆ జాబితాకి చెందిన కథానాయికలు తెలుగులో చాలామందే కనిపిస్తారు. ఈ ఏడాది వాళ్లందరికీ పుష్కలంగా అవకాశాలు దక్కాయి. వాటిని అదే స్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు కూడా. మరి ఎవరెవరి ప్రయాణం ఎలా సాగిందో ఓసారి చూసేద్దామా...

కొత్త పాత్రలతో అలరిస్తున్న నివేదా
కొద్దిమంది తారల కథల ఎంపికపై చాలా అంచనాలుంటాయి. వాళ్లు సినిమాలో ఉన్నారంటే ‘ఇందులో ఏదో ఉంటుంద’నే నిర్ణయానికొస్తుంటాడు సినీ అభిమాని. ఆయా తారల అభిరుచిపై అంత నమ్మకం. అలాంటి అభిరుచి ఉన్న తారల్లో 'నివేదా థామస్‌' ఒకరు. ఈమె మొదట్నుంచీ కొత్త కథలు, పాత్రలతోనే ప్రయాణం చేస్తోంది. ఈ ఏడాది ‘'118'’, '‘బ్రోచేవారెవరా' చిత్రాలతో మెరిసింది. ఈ రెండూ విజయాల్ని నమోదు చేశాయి. నివేదా థామస్‌ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం 'వి' చిత్రంతో బిజీగా గడుపుతోంది. రజనీకాంత్‌ ‘'దర్బార్‌'లోనూ మెరవబోతోంది.

ఆచితూచి అడుగేస్తున్న వివేతా పేతురాజ్​
నివేతా పేతురాజ్‌ కూడా ఈ తాను ముక్కే. ఈమె కూడా కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఈసారి ‘'చిత్రలహరి'’, 'బ్రోచేవారెవరురా' చిత్రాలతో మెరిసింది. సంక్రాంతికి 'అల.... వైకుంఠపురములో' సినిమాతో సందడి చేయబోతోంది. మరోవైపు రామ్‌తో కలిసి 'రెడ్‌'లో నటిస్తోంది.

తనదైన ముద్ర వేసుకున్న షాలిని పాండే
అర్జున్‌రెడ్డి భామ షాలిని పాండేకి ‘'118'తో మరో విజయాన్ని ఈ ఏడాది తన ఖాతాలో వేసుకుంది ఈ నటి. ‘'ఎన్టీఆర్‌ కథానాయకుడు'లో షావుకారు జానకి పాత్రలో మెరిసిన ఆమె, ఇటీవల విడుదలైన ‘'ఇద్దరి లోకం ఒకటే'తో నటిగా మరోసారి తనదైన ముద్ర వేసింది.
ఎన్ని అవకాశాలొచ్చినా ఓ సరైన విజయం రాలేదంటే సమస్యే. అదే సరైన సమయంలో ఒక్క విజయం వచ్చినా... వాళ్ల కెరీర్‌ కొన్నాళ్ల వరకు ఫలితాలతో సంబంధం లేకుండా పరుగులు పెడుతుంటుంది.

హనీ ఈజ్​ ద బెస్ట్​
గతేడాది మూడు సినిమాలు చేసినా విజయానికి నోచుకోలేకపోయిన మెహరీన్‌కి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఆరంభంలోనే '‘ఎఫ్‌-2'తో హనీ ఈజ్‌ ద బెస్ట్‌ అంటూ సందడి చేసింది. ఆ తర్వాత 'చాణక్య'లో గోపీచంద్‌తో కలిసి మెరిసింది. ఆ చిత్రం ఆకట్టుకోకపోయినా ఆమె జోరు కొనసాగుతూనే ఉంది. సంక్రాంతికి ‘ఎంత 'మంచివాడవురా'తో వినోదాలు పంచబోతోంది. నాగశౌర్య 'అశ్వథ్థామ'లోనూ నటించింది.

అవకాశాలు అందుకొని... ఆకట్టుకుని... అలరించి...

ఎట్టకేలకు తెలుగులో విజయం
కల్యాణి ప్రియదర్శన్‌ 'చిత్రలహరి'తో ఎట్టకేలకి తెలుగులో విజయాన్ని అందుకుంది. శర్వానంద్‌ సరసన 'రణరంగం'లోనూ మెరిసింది. అందులో కల్యాణి అందం, నటన కుర్రాళ్ల మనసు దోచింది. రెజీనా పడిలేచిన కెరటాన్ని గుర్తు చేసింది. ఆమె తెలుగులో విజయం అందుకుని ఎన్ని రోజులైందో. ఈ ఏడాది 'ఎవరు'తో విజయమే కాదు, నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసల్నీ సొంతం చేసుకుంది. '7'లోనూ ఆమె పాత్ర అలరించింది. మంచి ఫామ్‌లో ఉన్న ఆమె మరో కథ కోసం ఎదురు చూస్తోంది.

ఫామ్​ సొంతం చేసుకున్న లావణ్య
లావణ్య త్రిపాఠి కూడా ఫామ్‌ని తిరిగి సొంతం చేసుకుంది. 'అర్జున్‌ సురవరం'తో ఆమె విజయాన్ని సొంతం చేసుకుంది. సందీప్‌కిషన్‌ 'ఎ1 ఎక్స్‌ప్రెస్‌'లో హాకీ క్రీడాకారిణిగా నటిస్తోంది. 'రాక్షసుడు'తో తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది అనుపమ పరమేశ్వరన్‌. కొన్నాళ్లుగా మలయాళ చిత్రాలతోనే బిజీగా గడుపుతున్న ఈమె ఈ ఏడాది తెలుగులో సినిమాలు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది.

ఇస్మార్ట్‌ గ్లామర్‌
ఈ ఏడాది వెండితెరకు అసలు సిసలు గ్లామర్‌ అద్దిన నాయికలు అంటే ఇస్మార్ట్‌ భామలే గుర్తుకొస్తారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ కథా నాయికలుగా నటించారు. పూరి హీరోయిన్లంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ నాయికలు కూడా తెరపై ప్రత్యేకతని ప్రదర్శించారు. అందంతో అదరగొట్టారు. ఏడాది ఆరంభంలో చేసిన 'మిస్టర్‌ మజ్ను'తో కలిసి రాకపోయినా, 'ఇస్మార్ట్‌ శంకర్‌' విజయంతో ఊరట చెందింది నిధి. ప్రస్తుతం 'అశోక్‌ గల్లా' చిత్రంలో ఒక నాయికగా నటిస్తోంది. నభా నటేష్‌ అయితే వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. రవితేజ సరసన 'డిస్కోరాజా'లో నటిస్తుండడంతో పాటు... సాయితేజ్‌తో కలిసి 'సోలో బ్రతుకే సో బెటరు', బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో మరో చిత్రం చేస్తోంది. తెలుగమ్మాయి ఈషారెబ్బా కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఆమె ప్రధాన పాత్ర ధారిగా తెరకెక్కిన 'రాగల 24 గంటల్లో' థ్రిల్‌ని పంచింది. నందిత శ్వేత 'కల్కి', '7' చిత్రాలతో మెప్పించింది.

దర్శకనిర్మాతలే క్యూ కట్టేస్తారు...
‘‘పరిశ్రమకి దూరమైన కథానాయికలకి మళ్లీ కబురు పెట్టి అవకాశాలిస్తున్న సమయమిది. చిత్రసీమలో అందం కొరత ఆ స్థాయిలో ఉంది. అందంతో పాటు.. మంచి అభినయం కూడా ఉందని రుజువైతే వాళ్ల కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తారు. ఈ ఏడాది చేతినిండా సినిమాలతో చాలా మంది బిజీగా గడిపారు. కథల విషయంలో జాగ్రత్తలు తీసుకొని సినిమాలు చేసిన నాయికలకి ఈ ఏడాది మంచి ఫలితాలే దక్కాయనేది పరిశ్రమ వర్గాల మాట.

కనిపించారు కానీ...
ప్రేక్షకులు దాదాపు మరిచిపోతున్న దశలో ‘మేమూ రేస్‌లో ఉన్నాం’ అంటూ కొందరు నాయికలు తెలుగు తెరపై సందడి చేశారు. కానీ ఈ ఏడాది కూడా వాళ్లకి కలిసిరాలేదు. అందులో హన్సిక ఒకరు. ఆమె చేసిన 'తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్‌' మెప్పించలేదు. 'కల్కి'తో ఆదాశర్మ, 'వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి'తో లక్ష్మీరాయ్‌ తెలుగు ప్రేక్షకుల్ని మరోసారి పలకరించారు. అయినా ఫలితం దక్కలేదు. కొత్త భామ రుక్సర్‌ థిల్లాన్‌ 'ఏబీసీడీ'లో నటించింది కానీ విజయం అందుకోలేదు. నందిత రాజ్‌, అనీషా ఆంబ్రోస్‌, మన్నారా చోప్రా, మిస్తీ చక్రవర్తి, సురభి తదితరులు నటించిన సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఈ సినిమాలు బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయాయి. దాంతో వీళ్లకి పరాజయాలు తప్పలేదు.

Last Updated : Dec 28, 2019, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details