తెలంగాణ

telangana

ETV Bharat / sitara

థియేటర్లలోనే 'నిశ్శబ్దం'.. నిర్మాత క్లారిటీ - నిశ్శబ్దం సినిమా తాజా వార్తలు

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసకున్న ఈ సినిమా ఏప్రిల్​లో విడుదల కావాల్సింది. కానీ లాక్​డౌనా కారణంగా వాయిదా పడింది. ఇంకో రెండు మూడు నెలలు థియేటర్లు తెరిచే వీలు లేదు కాబట్టి ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు చిత్ర నిర్మాత కోన వెంకట్.

అనుష్క
అనుష్క

By

Published : May 18, 2020, 1:38 PM IST

అగ్రకథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్లపై కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుష్కతోపాటు మాధవన్‌, అంజలి, షాలినీ పాండే.. ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ నెలలో విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు మూతపడటం వల్ల 'నిశ్శబ్దం' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారంటూ కొన్నిరోజులుగా రూమర్లు‌ వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై తాజాగా చిత్రనిర్మాత కోన వెంకట్‌ స్పందించారు. "సినిమా పట్ల మాకున్న అమితమైన ఆసక్తి, ప్రేమతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టాం. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాం. మేము తీసిన సినిమా చూసి థియేటర్‌లో ప్రేక్షకులు ఇచ్చే రియాక్షనే మాకు ప్రేరణ, ఆక్సిజన్‌. ఆ ఫీలింగ్‌ను ఏదీ మ్యాచ్‌ చేయలేదు. సినిమా ఉన్నది సినిమా హాళ్ల కోసమే. అదే మా ప్రాధాన్యం కూడా....!!" అని కోన వెంకట్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ఈ చిత్రం ఓటీటీలో విడుదలవ్వబోతుందని వస్తోన్న వార్తలకు చెక్ పెట్టినట్లయింది.

ABOUT THE AUTHOR

...view details