తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అధికార లాంఛనాలతో దిలీప్​కుమార్​ అంత్యక్రియలు - దిలీప్​ కుమార్​ అంత్యక్రియలు

బాలీవుడ్​ దిగ్గజ నటుడు దిలీప్​ కుమార్(DilipKumar Died) ​అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. వందమందికిపైగా అభిమానులు ఆయన్ను చూసేందుకు తరలివచ్చారు.

Dilip Kumar
దిలీప్​కుమార్​

By

Published : Jul 7, 2021, 5:51 PM IST

అధికార లాంఛనాల నడుమ బాలీవుడ్​ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్(Dilip Kumar Died) అంత్యక్రియలు ముగిశాయి. శాంటాక్రూజ్​ ముంబయిలోని జుహు కబ్రాస్థాన్​లో ఈ కార్యక్రమం జరిగింది. కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. ఆయన్ను చూసేందుకు వందమందికిపైగా అభిమానులు రాగా, పోలీసులు వారిని అదుపుచేశారు.

గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న దిలీప్ కుమార్​ చికిత్స నిమిత్తం ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ముంబయి హిందూజ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస(Dilip Kumar Died) విడిచారు. ఆయన మరణ వార్తతో బీటౌన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. దిలీప్​ మృతిపట్ల పలువురు సినీ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details