తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయనిర్మల మృతి పట్ల ప్రముఖుల సంతాపం

టాలీవుడ్​ మహిళా దర్శక దిగ్గజం విజయనిర్మల మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని అభిప్రాయపడ్డారు.

విజయనిర్మల మృతి పట్ల ప్రముఖలు సంతాపం

By

Published : Jun 27, 2019, 9:30 AM IST

Updated : Jun 27, 2019, 9:59 AM IST

విజయనిర్మల మృతి పట్ల టాలీవుడ్​ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చిరంజీవి, చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని నందమూరి బాలకృష్ణ అన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ వివిధ రంగాల ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయనిర్మల భౌతిక కాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

"విజయనిర్మల మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు. న‌టి, ద‌ర్శకురాలు, నిర్మాత‌గా ఆమె త‌న‌దైన ప్రత్యేక‌త‌ సంపాదించుకున్నారు. ద‌ర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించి మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు." -బాలకృష్ణ, టాలీవుడ్ హీరో

"విజయ నిర్మల బహుముఖ ప్రజ్ఞాశాలి. నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు" -చిరంజీవి, టాలీవుడ్ నటుడు

"ప్రపంచ చలనచిత్ర చరిత్రలో 44 సినిమాలకు దర్శకత్వం వహించారు విజయనిర్మల. ఇలా మరెవరూ చేయలేదు." -ఎస్వీ రామారావు, సినీ విమర్శకులు

"విజయనిర్మల జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి"-జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ హీరో

"విజయ నిర్మల లేరనే వార్త నన్ను కలచి వేసింది. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి" -నితిన్, టాలీవుడ్ కథానాయకుడు

"వచ్చారు. ఎవరూ సాధించని ఘనతలు సాధించారు. మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. మీ చిత్రాలు మాకు ఎప్పటికీ గుర్తుంటాయి." -మంచు మనోజ్, టాలీవుడ్ హీరో

"నిర్మాత, దర్శకురాలిగా విజయనిర్మల ప్రత్యేకత చాటుకున్నారు. ఆమె మృతి చిత్రపరిశ్రమకు తీరనిలోటు"-మురళీమోహన్, నటుడు, రాజకీయనాయకుడు

"ఆమె మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విజయనిర్మల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా" -ఈషా రెబ్బా, టాలీవుడ్ నటి

ఇది చదవండి: మహిళా దర్శక దిగ్గజం విజయనిర్మల ఇకలేరు

Last Updated : Jun 27, 2019, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details