టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ఫిట్‌నెస్ కోసం తెగ కసరత్తులు చేస్తున్నారు. నన్ను ద్వేషించే వారే నాకు స్ఫూర్తి అంటూ వ్యాఖ్యానించారు. హీరో కల్యాణ్ దేవ్ తన సతీమణి శ్రీజతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. మరోపక్క కరోనా బారినపడి, కోలుకున్న అభిషేక్ బచ్చన్ వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు అని ఫాలోవర్స్‌కు సూచించారు.
మంచు లక్ష్మి, సన్నీ కసరత్తులు.. సమంత, అమల స్టన్నింగ్ లుక్స్ - celebrities posts
సినీ తారలు తమకిష్టమైన వ్యాపకాలతో బిజీబిజీగా గుడుపుతూ వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా సోషల్‌మీడియాలో వారు చేసిన పోస్టులపై ఓ లుక్కేద్దాం రండి..
మంచు లక్ష్మీ
నటి సన్నీ లియోనీ కాళ్ల బరువు తగ్గించుకోడానికి శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించి వ్యాయామం చేస్తున్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ కసరత్తు అంత తేలిక కాదని, తన పాత ఫొటోలో కాళ్లు నచ్చలేదని, అందుకే వాటిని కష్టపెట్టి బరువు తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు సన్నీ. ఇలా తాజాగా మన తారలు సోషల్‌మీడియాలో షేర్ చేసిన ఆసక్తికరమైన విశేషాలు చూద్దాం..