ట్రాన్స్‌జెండర్ మేకప్ ఆర్టిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో కుమారుడు అనంత్ కృష్ణన్‌పై మలయాళీ నటి మాల పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017 నుంచి మాల కుమారుడు అనంత్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అభ్యంతరకర ఫొటోలు పంపిస్తున్నాడని పేర్కొంటూ మేకప్ ఆర్టిస్ట్ సీమా వినీత్ ఇటీవలే సోషల్‌మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మాల వెంటనే సీమకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి.. ఒకవేళ తన కుమారుడు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనన్నారు.
కన్న కొడుకుపై కేసు పెట్టిన మలయాళీ నటి - mala parvathi latest updates
మలయాళీ నటి మాల పార్వతి తన కుమారుడు అనంత్ కృష్ణన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్‌జెండర్ మేకప్ ఆర్టిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్వతి తెలిపారు.

కన్న కొడుకుపై కేసు పెట్టిన మలయాళీ నటి
"మేకప్ ఆర్టిస్ట్ సీమా వినీత్‌తో తనకి ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహం ఉందని నా కుమారుడు అనంత్ చెప్పాడు. సీమ అంగీకారం లేకుండా తనతో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని అన్నాడు. అయితే ఈ విషయంలో నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేశాను. అలాగే అనంత్ సెల్‌ఫోన్‌ని పోలీసులకు అప్పగించాను. నేను సీమకే సపోర్ట్ చేస్తున్నా. అలా అని నా కుమారుడ్ని తప్పుగా చూడడం లేదు. ఒకవేళ నా కొడుకు తప్పుచేస్తే శిక్ష అనుభవించక తప్పదు." అని పార్వతి తెలిపారు.
ఇదీ చూడండి: