తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ సినీ నటుడు కన్నుమూత - ప్రముఖ సినీ నటుడు కన్నుమూత

ప్రముఖ సీనియర్​ నటుడు జనార్ధన్​రావు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

cinema actor janardhan rao died
ప్రముఖ సినీ నటుడు జనార్ధన్‌రావు కన్నుమూత

By

Published : Mar 6, 2020, 8:08 PM IST

టాలీవుడ్ సీనియర్‌ నటుడు జనార్ధన్‌రావు కన్నుమూశారు. శుక్రవారం ఉదయం చెన్నై నగరంలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

జనార్ధన్‌రావు స్వస్థలం గుంటూరు జిల్లా పొనిగళ్ల గ్రామం. దాదాపు వెయ్యికిపైగా తెలుగు చిత్రాలు, ధారావాహికల్లో నటించారు. 'జానకిరాముడు', 'మజ్ను', 'కొండవీటి సింహం', 'పెదరాయుడు', 'అభిలాష', 'అమ్మోరు', 'గోరింటాకు' వంటి ప్రముఖ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు.

జనార్ధన్‌రావు చివరిగా ఎన్టీఆర్‌ 'జనతా గ్యారేజ్‌' సినిమాలో కనిపించారు. 'గోకులంలో సీత', 'తలంబ్రాలు' వంటి సీరియళ్లలో నటించారు. దక్షిణ భారత ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌లో జాయింట్‌ సెక్రటరీ, కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు.

ఇదీ చూడండి :రోడ్​సైడ్​ దోశ వేసిన ప్రముఖ హీరోయిన్​

ABOUT THE AUTHOR

...view details