విద్యార్హతలు పెంచుకోవడానికి వయసుతో సంబంధం లేదని, చదువుకోవాలనే జిజ్ఞాస ఉంటే సరిపోతుందని చాలా మంది నిరూపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కోవలో సినీ నటి హేమ చేరారు. డిగ్రీ పట్టా పొందేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్న ఆమె.. అర్హత పరీక్షను ఆదివారం నల్గొండలోని ఎన్జీ కళాశాలలో రాశారు.
నల్గొండలో పరీక్ష రాసిన సినీ నటి హేమ - Cine actress hema in nalgonda
సినీనటి హేమ నల్గొండలో పరీక్ష రాశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్షకు హాజరయ్యారు.
నల్గొండలో పరీక్ష రాసిన సినీ నటి హేమ
ఎప్పటి నుంచో డిగ్రీ చేయాలని ఉందని హైదరాబాద్ అయితే ఇబ్బంది ఉంటుందని నల్గొండలో పరీక్ష రాసినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ లో పాల్గొంటున్నానని... నల్గొండ అయితే ఫిలింసిటీకి దగ్గరగా ఉండటం, హైదరాబాద్ లో కొవిడ్ కేసులు, ట్రాఫిక్ ఇబ్బందులు తదితరాలు ఉండడం వల్ల ఇక్కడ నల్గొండలో పరీక్ష రాసినట్టు చెప్పింది.